రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | young man dies in road accident in krishna district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Feb 27 2016 2:33 PM | Updated on Apr 3 2019 7:53 PM

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని బంటుమల్లి రోడ్డులో మల్లాయిపాలెం గేటు సమీపంలో శనివారం మధ్యాహ్నం ఓ ప్రమాదం చోటు చేసుకుంది.

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని బంటుమల్లి రోడ్డులో మల్లాయిపాలెం గేటు సమీపంలో శనివారం మధ్యాహ్నం ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడ్ని పామర్రుకు చెందిన దిలీప్‌గా గుర్తించారు. ఈ ఘటనలో గుడివాడకు చెందిన మరో వ్యక్తి కిరణ్‌కు గాయాలు కాగా విజయవాడ తరలించారు. వీరిద్దరూ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు. ఎదురుగా వస్తున్న బొలెరోను తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement