పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని పడమరవీధికి చెందిన లావణ్య(22) అనే యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని పడమరవీధికి చెందిన లావణ్య(22) అనే యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కడుపునొప్పితో బాధపడుతుంటే తానే తన కూతుర్ని ఆసుపత్రికి తీసుకు వచ్చానని లావణ్య తల్లి చెబుతోంది. కానీ డాక్టర్లు యువతి చనిపోయి చాలాసేపయిందని చెబుతున్నారు. లావణ్య తల్లికి ఐదుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. లావణ్య ప్రేమ వ్యవహారం నేపధ్యంలో తల్లే ఆమె చంపేసి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.