రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోటస్పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీఎల్పీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశం వివరాలను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మీడియాకు తెలిపారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానానికి ప్రభుత్వం అంగీకరించకపోతే, ఎల్లుండి ప్రైవేటు బిల్లు ప్రవేశపెడతామని, దీనివల్ల ఇక ఎవరు సమైక్యవాదులో, ఎవరో విభజన వాదులో తేలిపోతుందని ఆయన చెప్పారు.
కాగా, బ్రిజేష్ కుమార్ ట్రిభ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ఇంకా తుపాను బాధితులకు నష్టపరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, అధిక ధరల అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.