ఎస్ఐ కొట్టారని ఎన్నికల బహిష్కరణ | Voters boycott polls due to sub inspector halchal at polling booth in vizianagaram district | Sakshi
Sakshi News home page

ఎస్ఐ కొట్టారని ఎన్నికల బహిష్కరణ

Apr 11 2014 11:44 AM | Updated on Sep 17 2018 6:08 PM

విజయనగరం జిల్లా గజపతినగరంలో మండలం జిన్నాంలో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైల్వే ఉద్యోగిపై స్థానిక ఎస్.ఐ దాడి చేశారు.

విజయనగరం జిల్లా గజపతినగరంలో మండలం జిన్నాంలో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైల్వే ఉద్యోగిపై స్థానిక ఎస్.ఐ దాడి చేశారు. ఆ కారణంగా ఎందుకు దాడి చేశారంటూ రైల్వే ఉద్యోగి ఎస్.ఐను ప్రశ్నించారు. అంతే సదరు ఎస్.ఐ ఆగ్రహంతో ఉగిపోతూ... నన్నే ప్రశిస్తావా అంటూ ఉద్యోగిపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో ఎస్.ఐ, రైల్వే ఉద్యోగి మధ్య తోపులాట చోటు చేసుకుంది.

 

ఆ క్రమంలో ఎస్.ఐ డ్రెస్కు ఉండే స్టార్ పడిపోయింది. దాంతో రైల్వే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆ తతంగమంతా చూస్తున్న స్థానిక ఓటర్లు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్వే ఉద్యోగిని వదిలిపెట్టాలని స్థానికులు పోలీసులు డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు ససేమిరా అనడంతో... పోలింగ్ కేంద్రం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఉద్యోగిని వదిలి పెట్టేంతవరకు పోలింగ్ బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement