విశాఖ జిల్లాలో ఆరువేల ఎకరాల భూ సమీకరణ

Visakha Collector Vinay Chand Said Transparently Land Equation - Sakshi

విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో భూ సమీకరణ పారదర్శకంగా జరుగుతోందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు జిల్లాలో ఆరు వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో సెంట్ల భూమిని ఇళ్లు నిర్మాణం కోసం అర్హులైన పేదలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూ సేకరణ చేస్తున్నామని అదంతా పూర్తిగా ప్రభుత్వ భూమిలో మాత్రమే జరుగుతోందన్నారు. దీనికోసం నిర్దిష్టమైన లే అవుట్లు కూడా రూపొందించడమే కాకుండా మార్చి 10 నాటికి పూర్తిస్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

రైతులకు నష్టం కలిగించం..
ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న వ్యక్తులు కూడా నిర్దిష్టమైన ఆధారాలను బట్టి అభివృద్ధి చేసిన లే అవుట్లలో 900, 450 గజాల చొప్పున కేటాయించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ సిటీ లో ఇళ్ల కోసం రూ. 25 వేలు చొప్పున నగదు డిపాజిట్ చేసిన లబ్ధిదారులకు కేటాయింపు జరుగుతుందని వివరించారు. ఎక్కడ ప్రైవేట్ భూములు తీసుకోవడం కానీ, రైతులకు నష్టం కలిగించే రీతిలో భూ సేకరణ గాని సమీకరణ గాని ఉండదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 

భూ సమీకరణ కోసం రూ.1300 కోట్లు..
గిరిజన ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఆయా ప్రాంతాల్లో వారికి భూములు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా ఏజెన్సీలో పాడేరు ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపు జరుగుతుందన్నారు. పినగాడి లో పేదల కోసం రూపొందిస్తున్న లే అవుట్ లో మా భూమి పూర్తిగా ప్రభుత్వ ఖాళీ స్థలం గా చెప్పారు. రైతులకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎక్కడ  భూమి తీసుకోవడం లేదన్నారు.  రైతులకు భూ సమీకరణ కింద ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా వారి ఖాతాలోనే వేస్తున్నామ ని చెప్పారు.. భూసమీకరణ కోసం రూ. 1300 కోట్లు ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్‌ వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top