
పల్లె వాతావరణం బాగుంది : హీరోయిన్ శృతి
‘మంచితనానికి. మమతానురాగాలకు పెట్టింది పేరు పల్లెటూరు అంటే ఏమో అనుకున్నా.. ఇప్పుడు చూస్తుంటే
ఉప్పలగుప్తం : ‘మంచితనానికి. మమతానురాగాలకు పెట్టింది పేరు పల్లెటూరు అంటే ఏమో అనుకున్నా.. ఇప్పుడు చూస్తుంటే తెలుస్తోంది ఇక్కడ ఆప్యాయత...అనురాగం’ అని అన్నారు కొత్త నటి శృతివర్మ. ఉప్పలగుప్తం మండ లం సన్నవిల్లి గ్రామంలో చిత్రీకరణ జరుపుకుంటున్న బొమ్మనా ప్రొడక్షన్ నెంబర్-1 చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు వచ్చిన శృతివర్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఇక్కడి పచ్చని పొలాలు, పల్లెటూరి వాతారణం ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు. విశాఖకు చెందిన తాను కోనసీమ వాసుల ఆప్యాయత గురించి విన్నానని, ఇప్పుడు కళ్లారా చూస్తున్నానని పేర్కొన్నారు. కోనసీమ నిజంగా కేరళను తలపిస్తోందని పేర్కొన్నారు. కోనసీమ ప్రాంతం సినీ హబ్‌గా తప్పక మారుతుందని, ఇది అతిశయోక్తి కాదని చెప్పారు.
రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో తక్కువ బడ్జెట్‌తో ఎక్కవ సినిమాలు చిత్రీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, చిన్న నిర్మాతలు, చిన్న చిత్రాలు, వర్ధమాన కళాకారులకు మంచిరోజులు వస్తున్నాయని పేర్కొన్నారు. కోనసీమను కొత్త తరహాలో చూపించే చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుందని, దీనిని ఈ మా చిత్రం నిరూపిస్తుందని శృతివర్మ చెప్పారు. సహ నిర్మాత రాజేష్ రంబాల, దర్శకకుడు రాజారామ్మోహన్(రైటర్‌మోహన్), కెమెరామన్ మురళీల కృషి ఈ చిత్రంలో కనిపిస్తుందని చెప్పారు. హీరో రోహిత్, ప్రముఖ నటులు సుమన్ తదితర తారాగణంతో పని చేయడం ఆనందాన్నిచ్చిందన్నారు.