వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

Venkaiah Naidu Appreciates YS Jagan Government In Coronavirus Control - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. ‘ కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా నుంచి లక్ష సత్వర పరీక్ష (రాపిడ్ టెస్ట్) కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం ముదావహం. వీటి ద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు రావడం.. రోజుకు 10వేల మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటం మంచి పరిణామం’ అని ఉప రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. (ఏపీ: లక్ష కిట్లు వచ్చాయ్)

ఈ పరికరాల ద్వారా కరోనా కేసుల్లో ప్రాథమిక పరీక్షలను వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మరింత పకడ్బందీగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను చేపట్టేందుకు వీలవుతుందని అన్నారు. కాగా కోవిడ్‌– 19 వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించిన విషయం తెలిసిందే. త్వరలో మరో 9 లక్షల కిట్లను దిగుమతి చేసుకోనుంది. (కరోనా టెస్ట్ చేయించుకున్న సీఎం జగన్)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top