రెండు బైక్లు ఢీ; ఇద్దరు మృతి | Two killed in accident, hitting two bikes | Sakshi
Sakshi News home page

రెండు బైక్లు ఢీ; ఇద్దరు మృతి

Feb 18 2015 7:36 AM | Updated on Sep 2 2017 9:32 PM

శ్రీకాకుళం జిల్లాలోని హిర మండలం పెద్దసంకిలి వద్ద బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని హిర మండలం పెద్దసంకిలి వద్ద బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులిద్దరూ గొట్టాకు చెందిన అసిరినాయుడు, దుర్గాప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

పోల్

Advertisement