రెండు నెలల్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కానున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు.
	తిరుమల: రెండు నెలల్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కానున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఆదివారం
	శ్రీవారి ఆలయం ముందు మహామణి మండపాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండపాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సూచించిందని  మాణిక్యాలరావు చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
