కుటుంబ కలహాలతో ఒక యువకుడు గిరిజన మహిళపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.
విజయనగరం: కుటుంబ కలహాలతో ఒక యువకుడు గిరిజన మహిళపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బుధవారం విజయనగరం జిల్లా పాచిపెంట మండలం గరిశెగుడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోని శిముడివలస గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మెరకమ్మ(50)కు అదే గ్రామానికి చెందిన ఆమె మరిది కొడుకు లక్ష్మయ్య కుటుంబంతో గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన గొడవ సందర్భంగా లక్ష్మయ్య, మెరకమ్మపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించాడు. కాగా, పోలీసులు సీఎం బహిరంగసభలో ఉండటం, ఏజెన్సీ ప్రాంతం కావడంతో సంఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టేలా ఉందని సమాచారం.
(పాచిపెంట)