సృష్టికి మూలం అమ్మే.. తల్లిని గౌరవించిన చోటే ధర్మం ఉంటుందని చెబుతుంటాం. కానీ అమ్మనే వద్దనుకున్నారు ఆ పుత్రసంతానం. తల్లి మృతిచెందితే కన్నెత్తి చూడలేకపోయారు.
సృష్టికి మూలం అమ్మే.. తల్లిని గౌరవించిన చోటే ధర్మం ఉంటుందని చెబుతుంటాం. కానీ అమ్మనే వద్దనుకున్నారు ఆ పుత్రసంతానం. తల్లి మృతిచెందితే కన్నెత్తి చూడలేకపోయారు. మృతదేహాన్ని కూడా తీసుకుపోవడానికి రాలేదు. ఈ హృదయవిదాకర సంఘటన గురువారం గద్వాలలో పలువురిని కలిచివేసింది.
స్థానిక ఒంటెలపేట వీధికి చెందిన లక్ష్మి(65)పక్షవాతంతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురైంది. చంద్రన్న అనే వ్యక్తి ఆమెను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యపరిస్థితి విషమించి కన్నుమూసింది. ఆమెను చూసేందుకు కుటుంబసభ్యులు ఎవరు కూడా ఆ దరిదాపుల్లోకి రాకపోవడంతో చివరికి ఆస్పత్రి సిబ్బంది లక్ష్మి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.
- న్యూస్‌లైన్, గద్వాల న్యూటౌన్