అయిజ ప్రాథమిక ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం జరిగింది.
మహబూబ్‌నగర్ క్రైం,న్యూస్‌లైన్: అయిజ ప్రాథమిక ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని పద్మావతి కాలనీకి చెందిన పార్థసార ధి (30)ఉదయం విధులకు బయలుదేరాడు.
ఇంట్లో నుంచి బయటకు రాగానే గుండెలో నొప్పి రావడంతో విధులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. ఆయన భార్య రేఖ కూడా ైవె ద్యురాలు కావడంతో ప్రథమ చికిత్స నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మళ్లీ గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అంబులెన్స్‌లో వచ్చిన ఆయన నేరుగా వాహనం దిగి ఆస్పత్రిలోకి వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉన్న వైద్యుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరిక్షీంచిన వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
కుటుంబ కలహాలే కారణమా?
మృతుడు పార్థసారధి కర్నూలు జిల్లాకు చెందినవాడు. అక్కడే ఓ పీహెచ్‌సీలోవైద్యునిగా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం బదిలీపై అయిజ పీహెచ్‌సీకి వచ్చాడు. అతనికి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రేఖతో రెండేళ్లక్రితం వివాహమైంది. ఆమెకూడా వైద్యురాలే. వారు స్థానిక పద్మావతికాలనీలో నివాసం ఉంటున్నారు.
కాగా, వారికి సంతానం లేకపోవడంతో తరుచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రేఖ తన పుట్టింటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు బయలుదేరింది. దీంతో అతను 2 గంటల ప్రాంతంలో అప్పన్నపల్లి గ్రామశివారులో పాయిజన్ తీసుకున్నానని 108 అంబులెన్స్‌కు అతనే స్వయంగా ఫోన్‌చేశాడు. సిబ్బంది అతని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కానీ గుండెనొప్పి రావడంతోనే అతను మృతిచెంది ఉంటాడని వైద్యులు తెలిపారు.