‘సీట్లు కోసం కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదు’ | telangana decision is not taken for vote sake, says botsa satya narayana | Sakshi
Sakshi News home page

‘సీట్లు కోసం కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదు’

Aug 13 2013 2:55 PM | Updated on Jul 12 2019 3:10 PM

ఓట్ల కోసమో, సీట్ల కోసమో తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు.

హైదరాబాద్: ఓట్ల కోసమో, సీట్ల కోసమో తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బొత్స మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ అలా నిర్ణయం తీసుకుంటే నష్టపోతుందన్నారు.  తెలంగాణపై నిర్ణయాన్ని పార్టీలు విమర్శించడాన్ని ఆయన ఖండించారు. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని బొత్సతెలిపారు.

 

 అసెంబ్లీలో అభిప్రాయాలు కోరతారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. సీమాంధ్ర ప్రతినిధులు అభిప్రాయాలు చెప్పేందుకు  అసెంబ్లీలో ఉండాలి కదా అని ఎదురు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement