విద్యార్థినితో టీచర్‌ సహజీవనం.. పెళ్లి! 

 teacher married 8th class student in east godavari district - Sakshi

వై.రామవరం (రంపచోడవరం): పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు 8వ తరగతి చదివే బాలికను మోసం చేసి సహజీవనం చేశాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. తనకు తొలుత వివాహం జరిగినట్టు, ఇద్దర్నీ బాగా చూసుకుంటానని ఉపాధ్యాయుడు చిన్నబ్బాయి లిఖితపూర్వకంగా గ్రామ పెద్దలకు రాసిచ్చిన లేఖ, పెళ్లి ఫొటోలు వాట్సప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేస్తుండటంతో కలకలం రేగింది. తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని దాలిపాడు గ్రామ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణను వివరణ కోరగా.. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు వారం రోజుల కిందట వచ్చి, తమ బిడ్డకు టీసీ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి తీసుకుపోయారన్నారు. అంతకుమించి తమకు ఏమీ తెలియదని చెప్పారు. ఉపాధ్యాయుడి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top