Sakshi News home page

'శివరామకృష్ణన్ కంటే నారాయణ గొప్పవారా'

Published Mon, Apr 20 2015 6:10 PM

'శివరామకృష్ణన్ కంటే నారాయణ గొప్పవారా' - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసమే శివరామకృష్ణన్ కమిటీని పక్కనబెట్టారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. శివరామకృష్ణన్ కంటే మంత్రి నారాయణ గొప్పవారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడం ఎంతవరకు సమంజసమని సీతారాం విమర్శించారు.

ఎన్నికల్లో హవాలా నడిపిన మంత్రి నారాయణకు కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూర్చడమే లక్ష్యమా అని తమ్మినేని సీతారాం నిలదీశారు. రాజధాని ఎంపికలో నారాయణ కమిటీ నివేదిక ప్రజల్లో అనుమానాలకు దారితీసేలా ఉందని తప్పుపట్టారు. 60 అంతస్తుల భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ఇన్ని వేల ఎకరాలు సేకరించడం ఎందుకని తమ్మినేని సీతారాం విమర్శించారు. ఇప్పటి వరకు రాజధాని మాస్టర్ ప్లానే ఇవ్వలేదని, మరో 4 నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయాలపై పునరాలోచించుకుని, ప్రజల సమస్యలపై దృష్టిపెట్టాలని తమ్మినేని సీతారాం హితవు పలికారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement