ఎంసెట్ రెండవ విడత కౌన్సిలింగ్ కు అనుమతి | Supreme Court approval to EAMCET second phase counseling | Sakshi
Sakshi News home page

ఎంసెట్ రెండవ విడత కౌన్సిలింగ్ కు అనుమతి

Oct 27 2014 1:06 PM | Updated on Sep 2 2018 5:20 PM

ఎంసెట్ రెండవ విడత కౌన్సిలింగ్ కు అనుమతి - Sakshi

ఎంసెట్ రెండవ విడత కౌన్సిలింగ్ కు అనుమతి

ఎంసెట్ రెండవ విడత కౌన్సిలింగ్ కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

న్యూఢిల్లీ: ఎంసెట్ రెండవ విడత కౌన్సిలింగ్కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నవంబర్ 14 నాటికి కౌన్సిలింగ్, తనిఖీలు పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీల అడ్మిషన్లను రద్దు చేయాలని  ఆదేశించింది. ఈ షరతులకు లోబడే విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని కోర్టు సూచన చేసింది. అలాగే 200 రోజులపాటు క్లాసుల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ ఇవ్వాలని కాలేజీలకు కోర్టు తెలిపింది.

విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం  ఆదేశించింది. 174 కాలేజీల ప్రమాణాల పాటింపు విషయం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఐఐటి, బిట్స్ పిలానీ నిపుణులతో కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

అనుమతుల ఆలస్యం కారణంగా ఎంసెట్ కౌన్సిలింగ్‌లో అవకాశం కోల్పోయామని, మరోసారి కౌన్సిలింగ్‌కు అనుమతించాలని కోరుతూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన అడ్మిషన్లకు కోర్టు అనుమతి ఇచ్చింది. రేపు కూడా సుప్రీం కోర్టు వాదనలను విననుంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement