సైనికుడికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు | State funeral for Jawan | Sakshi
Sakshi News home page

సైనికుడికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Aug 28 2015 3:14 PM | Updated on Nov 9 2018 5:52 PM

విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవానుకు మదనపల్లి మండలం సిద్ధమ్మగారి పల్లెలో శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

చిత్తూరు (మదనపల్లి) : విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవానుకు మదనపల్లి మండలం సిద్ధమ్మగారి పల్లెలో శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. పులిచర్ల మండలం ఉర్వపల్లికి చెందిన రాసాని సిద్ధయ్య(47) బీఎస్‌ఎఫ్ ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడు.

కాగా ఒరిస్సాలోని మల్కన్‌గిరి-చిత్రకొండ అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉండగా మూడురోజుల క్రితం మందుపాతర పేలి మృతిచెందాడు. మృతదేహాన్ని శుక్రవారం ఉదయం సిద్ధమ్మగారిపల్లికి తీసుకువచ్చారు. అనంతరం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సిద్ధయ్య పెళ్లైన తర్వాత ఉర్వపల్లి నుంచి వచ్చి మదనపల్లిలోని శివాజీనగర్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement