15,16తేదీల్లో ఏపీకి నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon To AP By June 16th - Sakshi

సాక్షి, విశాఖపట్నం : నైరుతి రుతుపవనాలు ఈ నెల 6న కేరళ.. 15, 16 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయని వాతావరణ నిపుణులు ప్రొఫెసర్‌ భానుకుమార్‌ తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆన్ సెట్  కావడానికి మూడు మహా సముద్రాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం తగ్గడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. హిందు మహా సముద్రం డై పోల్ ఇండెక్స్, అట్లాంటిక్ నినో కూడా ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఉపరితల ఆవర్తనాలు, బలమైన అల్పపీడన ద్రోణులు ఏర్పడితే రుతుపవనాల రాక ముందుగానే ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top