పాట రాసేందుకు నిరాకరించిన సిరివెన్నెల | Sirivennela refuses to pen Visakha Utsav theme song | Sakshi
Sakshi News home page

పాట రాసేందుకు నిరాకరించిన సిరివెన్నెల

Jan 21 2015 10:06 AM | Updated on Nov 6 2018 4:19 PM

పాట రాసేందుకు నిరాకరించిన సిరివెన్నెల - Sakshi

పాట రాసేందుకు నిరాకరించిన సిరివెన్నెల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న విశాఖ ఉత్సవానికి థీమ్ సాంగ్ రాసేందుకు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిరాకరించినట్లు సమాచారం.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న విశాఖ ఉత్సవానికి థీమ్ సాంగ్ రాసేందుకు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిరాకరించినట్లు సమాచారం. ఈ ఉత్సవం కోసం థీమ్ సాంగ్ రాయాలని నిర్వాహాకులు సిరివెన్నెలను సంప్రదించగా అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఈ ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో థీమ్ సాంగ్ కోసం నిర్వహాకులు  థీమ్ సాంగ్ రాయించేందుకు స్థానికంగా ఉన్న గీత రచయితలను సంప్రదిస్తున్నారని సమాచారం.  

అయితే విశాఖ ఉత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తామని భీమిలి ఎమ్మెల్యే, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో వెల్లడించారు. అందుకోసం ప్రముఖ గీత రచయితతో థీమ్ సాంగ్ రాయిస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉత్సవం జనవరి 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement