సూళ్లూరుపేటలో ఎస్ఐ అనుమానాస్పద మృతి | SI dies in sullurpet lodge | Sakshi
Sakshi News home page

సూళ్లూరుపేటలో ఎస్ఐ అనుమానాస్పద మృతి

Jan 4 2014 10:27 AM | Updated on Sep 2 2018 3:46 PM

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ప్రైవేట్ లాడ్జిలో కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్)కు చెందిన ఎస్ఐ తిమ్మయ్య అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ప్రైవేట్ లాడ్జిలో కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్)కు చెందిన ఎస్ఐ తిమ్మయ్య అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. దాంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసుల హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఎస్ఐ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

పోస్ట్ మార్టం నిమిత్తం అతడి మృతదేహన్నినెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షార్ కేంద్రంలో మృతులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతిగా మద్యం సేవించడం వల్లే అతడు మరణించి ఉండవచ్చని పోలీసుల భావిస్తున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement