రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మీకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎనిమిది లైన్ల రోడ్డు కావాల్నా? అని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్ర విభజనకు కారణమే సీమాంధ్రులని, దోచుకున్నదే ఆంధ్రోళ్లని మండిపడ్డారు. ఆంధ్రోళ్ల పాలనలో నష్టపోయిన తెలంగాణను కాదని ఆంధ్రాకు భారీ ప్యాకేజీలు కావాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు కోరడం దారుణమని చెప్పారు. విభజనతో వచ్చే సమస్యలను వదిలి అపోహల్ని తీర్చాలని కోరడం సమంజసం కాదన్నారు. కాగా, రాష్ట్రంలో 76 వేల సర్కారీ స్కూళ్లుంటే 47 వేల పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీళ్ల సౌకర్యం లేకపోవడం దారుణమని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎం కిరణ్‌కి లేఖ రాశారు.