‘సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం’ పరీక్ష నేడే | sakshi school of journalism exam today | Sakshi
Sakshi News home page

‘సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం’ పరీక్ష నేడే

Dec 22 2013 1:10 AM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ‘సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం’ ప్రవేశ పరీక్ష ఈ రోజు(ఆదివారం) ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 22 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ‘సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం’ ప్రవేశ పరీక్ష ఈ రోజు(ఆదివారం) ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 22 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు 7 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు; పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులంతా నిర్దేశిత సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తెలిపింది. ఇంకా హాల్‌టిక్కెట్లు పొందని అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్లతో ‘సాక్షి’ వెబ్‌సైట్లు www.sakshieducation.com, www.sakshischoolofjournalism.com
 నుంచి వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీల ఆధారంగా కూడా వెబ్‌సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

‘సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం’, పరీక్ష, హైదరాబాద్,sakshi school of journalism, hyderabad
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement