కేంద్ర ప్రభుత్వం పెట్రో వాహనదారులకు ఊరట ఇస్తూనే.. డీజిల్ వినియోగదారులపై భారం మోపింది. పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.15 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
నెల్లూరు,(దర్గామిట్ట), న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం పెట్రో వాహనదారులకు ఊరట ఇస్తూనే.. డీజిల్ వినియోగదారులపై భారం మోపింది. పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.15 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై 50 పైసలు పెంచింది. పెరిగిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయని ఆయిల్ కంపెనీ అధికారులు చెబుతున్నారు. అ
న్ని రకాల పన్నులతో కలిపి డీజిల్‌కు లీటరుపై 0.62 పైసలు పెరగనుంది. దీంతో జిల్లాలో డీజిల్ వినియోగదారులకు రోజుకు రూ. 4.34 లక్షలు భారం పడనుంది. పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.15 తగ్గడంతో అన్ని రకాల పన్నులతో కలిపి దాదాపు రూ.1.51 తగ్గనుంది. జిల్లాలో డీజిల్ రోజుకు అన్ని కంపెనీల నుంచి దాదాపు 7 లక్షలకు పైగా విక్రయం జరుగుతుంది. పెట్రోల్ రోజుకు 1.80 లక్షల లీటర్ల అమ్మకం జరుగుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.