ఆ టీచర్ని ఉరి తీయాలి: సీఆర్ | ramachandraiah demand on green field blind school incident | Sakshi
Sakshi News home page

ఆ టీచర్ని ఉరి తీయాలి: సీఆర్

Sep 1 2014 1:54 PM | Updated on Aug 18 2018 9:30 PM

ఆ టీచర్ని ఉరి తీయాలి: సీఆర్ - Sakshi

ఆ టీచర్ని ఉరి తీయాలి: సీఆర్

అంధ విద్యార్థులను కిరాతంగా కొట్టిన ఉపాధ్యాయుడిని ఉరి తీయాలని సి. రామచంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాల ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సోమవారం చర్చ జరిగింది.  అంధ విద్యార్థులను కిరాతంగా కొట్టిన ఉపాధ్యాయుడిని ఉరి తీయాలని సి. రామచంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాల గుర్తింపు రద్దు చేశామని, బాధ్యులైన వారిని అరెస్ట్ చేశామని చెప్పారు.

సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్ ముగ్గురు విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదడడంతో వీరిని అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement