ఎమ్మెల్యే చింతమనేనిపై పోలీసు కేసు | Police Case filed Against TDP MLA Chintamaneni Prabhakar | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చింతమనేనిపై పోలీసు కేసు

Oct 23 2017 6:07 PM | Updated on Aug 21 2018 6:21 PM

Police Case filed Against TDP MLA Chintamaneni Prabhakar - Sakshi

సాక్షి, ఏలూరు: ఎట్టకేలకు వివాదాస్పద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసు కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఏలూరు మండలం మాదేపల్లి శివారు గ్రామం లింగారావుగూడెంలో చింతమనేని ప్రభాకర్‌ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలను పరిష్కరించమని స్థానికులు వేడుకున్నారు. అయితే ఏమాత్రం కనికరం లేని సదరు ఎమ్మెల్యే, ఆయన అనుచరులు మహిళలు, చిన్నారులపై దౌర్జన్యం చేశారు.

దీనిపై ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులు తమపై దౌర్జన్యం చేశారంటూ కాలనీ వాసులు, మహిళలు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చింతమనేని తమ కాలనీకి వచ్చి తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా బూతులు తిడుతూ తమ ఇళ్లలోని సామాన్లు బయటపారేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement