చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్‌ | Petition Filed In High court Against Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్‌

Jul 11 2019 10:37 PM | Updated on Jul 11 2019 10:41 PM

Petition Filed In High court Against Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు సరైన వివరాలు ఇవ్వలేదంటూ కుప్పం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత విద్యాసాగర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి తాను తీసుకున్న జీతభత్య వివరాలను ఎన్నికల అఫిడవిట్లో సమర్పించలేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల అఫిడవిట్లో సరైన వివరాలు ఇవ్వలేదంటూ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా టీడీపీ అధ్యక్షుడే అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించడంపై హైకోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement