మండలంలోని అంకవరం గ్రామానికి చెందిన ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. స్థానికులు, మృతుడి
బావమరుదులు, కానిస్టేబుల్ కొట్టడమే కారణం ?
పోలీసులను నిలదీసిన గ్రామస్తులు
జియ్యమ్మవలస : మండలంలోని అంకవరం గ్రామానికి చెందిన ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. స్థానికులు, మృతుడి తండ్రి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చందాపు అప్పలనాయుడు (40)కి వీరఘట్టాం మండలం తూడి గ్రామానికి చెందిన అమ్మాయితో పదహారు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గొడవ జరిగిన ప్రతిసారీ అమ్మారుు తన కుటుంబ సభ్యులను తీసుకురావడం, వారు వచ్చి అప్పలనాయుడును కొట్టడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలో ఇటీవల కూడా భార్యభర్తల మధ్య గొడవ జరగ్గా అమ్మారుు తన సోదరులను రప్పించింది. వారు జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో కలిసి శుక్రవారం గ్రామానికి వచ్చి అప్పలనాయుడును చావబాదారు. అక్కడితో ఆగకుండా కొట్టుకుంటూ జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో మృతుని భార్య అమ్మాయి తన మామ సింహాద్రిని లేపి మీ అబ్బారుు చలనం లేకుండా పడిఉన్నాడని తెలిపింది. వెంటనే సింహాద్రి వచ్చి చూసే సరికి అప్పలనాయుడు ఇంట్లో విగతజీవిగా పడిఉన్నాడు.
పోలీసులు, అమ్మారుు సోదరులు కొట్టడం వల్లే తన కుమారుడు చనిపోయూడని సింహాద్రి ఆరోపిస్తున్నాడు. తన కుమారుడు చనిపోరుునా ఇంతవరకు బావమరుదులు, అత్త,మామాలు ఎవ్వరూ రాకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించాడు. ఇదే విషయమై ఎస్సై సాంబశివరావును వివరణ కోరగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు అప్పలనాయుడును స్టేషన్‌కు తీసుకువచ్చి మందలించి, తర్వాత వదిలేశామన్నారు.
ఆయన ఎలా చనిపోయిందీ తెలియదని చెప్పారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. పోలీసుల తీరు వల్లే అప్పలనాయుడు చనిపోయూడని ఆరోపిస్తూ గ్రామస్తులందరూ పోలీసులను నిలదీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.