మీ ఆర్థిక స్వేచ్ఛకు.. నా భరోసా

Peoples Hopeful For YS Jagan Navaratnalu Scheme - Sakshi

అధికారంలోకి రాగానే పింఛన్‌ పెంపు

రూ.2 వేల నుంచి రూ.3 వేలకు హామీ

సాక్షి, వెంకటాచలం: చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చిన జన్మభూమి కమిటీ సభ్యుల కారణంగా పింఛన్‌ పొందేందుకు అర్హత ఉండి కూడా నేటికీ పింఛన్‌ అందక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వృద్ధులు ప్రతీ చోట ఉన్నారు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు అధికారులు పింఛన్‌ మంజూరుకు సముఖత వ్యక్తంచేసినా జన్మభూమి కమిటీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగులుతుండటంతో అర్హులుకు ఎదురుచూపులు తప్పడం లేదు. పాదయాత్రలో వృద్ధుల సాదక, బాధలు విని చెలించిపోయిన జగన్‌మోహన్‌రెడ్డి మీకు అండగా నేనున్నానంటూ.. రూ.1000 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచి రూ.3 వేల వరకూ పెంచుకుంటూ పోయి వృద్ధులకు అండగా నిలుస్తానని ప్రకటించారు. జగన్‌మోహన్‌రెడ్డి పథకాలను కాపీకొడుతూ చంద్రబాబు పింఛన్‌ను ఎన్నికల ముందు రూ.2 వేలకు పెంచారు. ఈ క్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ.3 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలంటూ ప్రతీ ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.

పింఛన్ల పెంపు హర్షణీయం     
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3,000 వేలకు పెంచుతానంటూ ప్రకటించడం హర్షించదగ్గ నిర్ణయమే. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చారు. ఈ పథకం కొనసాగిస్తే పింఛన్‌దారులందరూ జగన్‌కు మద్దతు ఉంటారు. 
–    తులసింగారి రాములమ్మ, కోడూరు, తోటపల్లిగూడూరు

తండ్రి బాటలోనే తనయుడు   
తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ పేదల బాగుకోసం పరితపిస్తున్నారు. పింఛన్‌ రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని చెప్పడంతో రాష్ట్రానికి జగనే సీఎం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. 
  –    మందల సుందరయ్య, తిక్కవరప్పాడు, వెంకటాచలం

వృద్ధులకు ఇబ్బందులు ఉండవు      
పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమలు చేస్తాడనే నమ్మకం ఉంది.
–     ఎ గురవయ్య, కంటేపల్లి, వెంకటాచలం

జగన్‌పై నమ్మకం ఉంది    
జగన్‌ సీఎం అయితే వృద్ధుల జీవితాలు మెరుగు పడతాయి. రూ.3 వేలు పింఛన్‌ అందజేస్తానని ప్రకటించారు. జగన్‌ నవరత్నాల్లో పింఛను రూ.2 వేలుకు పెంచుతాని హామీ ఇవ్వడం వల్లనే చంద్రబాబు గతనెలలో రూ.2 వేలు పింఛను అందజేశాడు. 
 –    ఎం.చంటయ్య, పులికల్లు, పొదలకూరు

సంక్షేమ పథకాలు జగన్‌కే సాధ్యం     
సంక్షేమ పథకాలు జనగ్‌కే సాధ్యం. వికలాంగులకు టీడీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. పింఛన్లను రూ.3 వేలకు పెంచి అందజేస్తానని జగన్‌ ప్రకటించడం సంతోషంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం జగన్‌ ప్రకటనల వల్లనే రూ.2 వేలు పింఛన్లను అందజేసింది.
–    ఎన్‌.ప్రకాశం, పొదలకూరు

పింఛన్‌ పెంచింది వైఎస్సారే    
రూ.75 ఉన్న వృద్ధుల పింఛన్ను వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాత రూ.200 లకు పెంచారు. తర్వాత జగన్‌ సీఎం అయితే రూ.2 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు జగన్‌ ఇచ్చిన హామీతోనే గతనెల పింఛన్‌ పెంచారు.
–   కె.రామయ్య, పులికల్లు, పొదలకూరు

జగన్‌ వస్తే రూ.3 వేల పింఛన్‌ ఇస్తాడు   
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట ప్రకారం రూ.3 వేలు పింఛను ఇస్తాడన్న నమ్మకం ఉంది. 5 సంవత్సరాలు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా పింఛన్లు పెంచడం ఎన్నికల ఎత్తుగడే. నాకు ఒక కాలు లేకున్నా అందరిలాగే రూ.2 వేల పింఛను మాత్రమే ఇస్తున్నారు. 
–   శివకుమార్, దివ్యాంగుడు, మనుబోలు

జగన్‌ వల్లే పింఛన్‌ పెంపు    
ఐదు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత డిసెంబర్‌ వరకూ పింఛను పెంచలేదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నందున అదీ జగన్‌మోహన్‌రెడ్డి పింఛన్‌ రూ.2 వేలు ఇస్తానని ప్రకటించడంతో తాను కూడా రూ.2 వేలు చేశాడు. నిజంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల మీద ప్రేమ ఉంటే గతంలోనే పెంచేవారు.
–   బి.జయమ్మ, మనుబోలు

నియోజకవర్గ పరిధిలో పింఛన్‌దారుల వివరాలు..

మొత్తం లబ్ధిదారుల సంఖ్య    32,153 
వెంకటాచలం    7,031
పొదలకూరు     8,225
టీపీగూడూరు  6,222
ముత్తుకూరు    6,037
మనుబోలు     4,638

  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top