
‘అన్నా.. నేను చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. వైద్య సాయం కోసం ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’ అంటూ విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన షేక్ నాగూర్‌బి జననేత ఎదుట వాపోయారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఉండవల్లిసమీపంలో జగన్‌ను కలసి తన సమస్యవిన్నవించారు. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలంటున్నారని, తన భర్త కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆపరేషన్‌కు పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో అంత ఖరీదైన ఆపరేషన్ కుదరదంటున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. తనను ఆదుకోవాలని జగన్‌ను కోరారు.