వైఎస్సార్‌సీపీ పోరాటం ప్రశంసనీయం | Pawan Kalyan Lauds YSRCP MPs' Efforts For AP Special Status | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పోరాటం ప్రశంసనీయం

Apr 14 2017 1:44 AM | Updated on Mar 23 2019 9:10 PM

వైఎస్సార్‌సీపీ పోరాటం ప్రశంసనీయం - Sakshi

వైఎస్సార్‌సీపీ పోరాటం ప్రశంసనీయం

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తరచూ అన్యాయాలు ఎదురవుతుంటే సహించి ఏం ప్రయోజనమని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు.

ట్వీట్లు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తరచూ అన్యాయాలు ఎదురవుతుంటే  సహించి ఏం ప్రయోజనమని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకు చెందిన న్యూస్‌ క్లిప్పింగ్‌తో పవన్‌ గురువారం వరుసగా ట్వీట్లు చేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేస్తున్న పోరాటం ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.

 హోదాపై పార్లమెంటులో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు గైర్హాజరు కావడాన్ని  తప్పుపట్టారు. కేంద్రమంత్రి ఆశోక్‌ గజపతిరాజు ఈ చర్చలో పాల్గొనకుండా మౌనంగా ఉండటం తనను ఎంతో బాధపెట్టిందన్నారు.   ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఓట్లతో టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చి, తర్వాత వారి మనోభావాలను గౌరవించకపోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన తెలంగాణ ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement