పైలిన్ తుపాను ప్రభావిత మండలాల జాబితాను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పైలిన్ తుపాను ప్రభావిత మండలాల జాబితాను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 8తేదీ నుంచి 27 వరకు పైలిన్ తుపాను ప్రభావంతో జిల్లాలోని 32 మండలాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఫలితంగా ఈ మండలాల్లో వివిధ రకాలుగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైలిన్ తుపాను ప్రభావిత మండలాలను గుర్తిస్తూ.. నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. అయితే ఈ తుపాను వల్ల జరిగిన నష్టం ఏమిటనే అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వ శాఖల వారీగా వచ్చిన నివేదికల ఆధారంగా నష్టాన్ని అంఛనా వేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో నిధుల విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
పైలిన్ ప్రభావిత మండలాలివే..
పైలిన్ తుపాను ప్రభావంతో జిల్లాలోని 32 మండలాలు తీవ్రంగా నష్టపోయాయి. వీటిలో రాజేంద్రనగర్, మహేశ్వరం, కందుకూరు, మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, ధారూరు, దోమ, పరిగి, చేవెళ్ల, నవాబ్‌పేట్, పూడూరు, వికారాబాద్, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, మంచాల, సరూర్‌నగర్, యాచారం, తాండూరు, యాలాల, బషీరాబాద్, మర్పల్లి, మోమిన్‌పేట్, పెద్దేముల్, ఘట్‌కేసర్, శామీర్‌పేట్, బంట్వారం, కుల్కచర్ల, గండేడ్, కీసర, మేడ్చల్ మండలాలున్నాయి.