విజయనగరం జిల్లా జీయమ్మవలస మండలం చింతల బెలగాం వద్ద బుధవారం రాత్రి రెండు బైక్లు ఢీకొన్నాయి.
విజయనగరం: విజయనగరం జిల్లా జీయమ్మవలస మండలం చింతల బెలగాం వద్ద బుధవారం రాత్రి రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. భార్యా భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గరుగుబిల్లి మండలం గిజబ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్(23) విశాఖపట్టణంలో రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడు గిజబ నుంచి జీయమ్మవలస మండలంలోని చిన్న మేరంగికి బుధవారం రాత్రి బైక్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో పార్వతీపురం నుంచి జి.శ్రీనివాసరావు, విమలమ్మ దంపతులు తమ సొంతూరు అప్పన్నదొరకు బైక్‌పై వెళుతున్నారు. ఈ రెండు వాహనాలు జీయమ్మవలస మండలం చింతల బెలగాం వద్ద రాత్రి 10.30 గంటల సమయంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అనిల్‌కుమార్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. శ్రీనివాసరావు, విమలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.