ఎడ్‌సెట్‌లో మనోడే ఫస్ట్ | nandeswara kumaraiah got first rank in edcet 2014 | Sakshi
Sakshi News home page

ఎడ్‌సెట్‌లో మనోడే ఫస్ట్

Jun 20 2014 2:28 AM | Updated on Sep 2 2017 9:04 AM

ఎడ్‌సెట్‌లో మనోడే ఫస్ట్

ఎడ్‌సెట్‌లో మనోడే ఫస్ట్

బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్-2014లో పాములపాడు మండలం ఇస్కాల గ్రామ విద్యార్థి నందీశ్వర కుమారయ్య ప్రతిభ చాటాడు.

కర్నూలు(విద్య): బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్-2014లో పాములపాడు మండలం ఇస్కాల గ్రామ విద్యార్థి నందీశ్వర కుమారయ్య ప్రతిభ చాటాడు. సోషల్ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు.  ఈ విద్యార్థి తండ్రి బత్తిని నాగమల్లప్ప వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె రాజేశ్వరికి వివాహం కాగా, మొదటి కుమారుడు శివకుమార్ పాములపాడులో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.
 
 రెండో కుమార్తె మౌనిక ఇంటర్ పూర్తి చేశారు. రెండో కుమారుడు నందీశ్వర కుమారయ్య ఇస్కాల గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి 502 మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఆత్మకూరులోని థెరిస్సా జూనియర్ కళాశాలలో హెచ్‌ఈసీ గ్రూపులో ఇంటర్మీడియట్‌లో చేరి 888 మార్కులు సాధించాడు. ఆ తర్వాత నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. తాజాగా బీఈడీ చదవాలన్న ఉద్దేశంతో గత నెలలో నిర్వహించిన ఎడ్‌సెట్-2014 పరీక్ష రాశాడు. సోషల్ సబ్జెక్టును ఆప్షన్‌గా తీసుకున్న అతను రాష్ట్రస్థాయిలో 102 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. తనకు చరిత్ర పుస్తకాలు చదవడం ఆసక్తి అని కుమారయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement