మూడు గంటల నరకం

NAD Junction Traffic Jam in Visakhapatnam - Sakshi

ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్‌ రద్దీ

ఇబ్బందులు పడ్డ విద్యార్థులు, ఉద్యోగులు

ఆలస్యంగా స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): ఎన్‌ఏడీ జంక్షన్‌లో వాహన చోదకులు నరకం చూశారు. సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కూ డలిలో వాహనాలు ముందుకు కదలలేదు. ఏ వైపు చూసినా వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఫలితంగా అటు ఉద్యోగులు ఇటు విద్యార్థులు నకరం చూడాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ట్రాఫిక్‌ నిలిచిపోలేదని వాహన చో దకులు ఆశ్చర్యపోయారు. బీఆర్‌టీఎస్‌ రహదా రిలో బాజీ జంక్షన్‌ దాటిపోయింది.  80అగుడుల రహదారిలో కూడా సీతారామరాజునగర్‌ శివాల యం వరకు వాహనాలు నిలిచి పోయాయి.

జాతీయ రహదారిపై వాహనాల బారులు
ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌  నిర్మాణం కోసం ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్ల వల్ల రహదారి కుచించుకుపోయింది. దీంతో ఎక్కువ సంఖ్యలో వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేక పోవడంతో రద్దీ మరింత ఎక్కువయింది. కూడలిలో రద్దీ ఉన్న వాహనాలను పంపే ప్రయత్నంలో గోపాలపట్నం నుంచి వచ్చే వాహనాలకు ఎక్కువ సమయం కేటాయిస్తుంటే మిగిలిన రహదారుల్లో రద్దీ ఎక్కువవుతుండడంతో ట్రాఫిక్‌ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు కార్తీక సోమవారంతో పాటు ఏకాదశి కావడంతో భక్తులు ఆలయాలకు వెళ్లి రావడం వల్ల సాధారణంగా కాకుండా రద్దీ ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. 11గంటల తర్వాత కాస్త ఉపశమనం కలిగింది.

ఎన్‌ఎస్టీఎల్‌ గోడ తొలగింపే ప్రత్యామ్నాయం
ఎన్‌ఎస్టీఎల్‌ గోడ తొలగింపే ట్రాఫిక్‌ ఇక్కట్లు తొలగించడానికి ప్రత్యామ్నాయమని వాహన చోదకులు వాపోతున్నారు. లోపల పనులు వేగవంతం చేసి గోడను తొలగించి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు ఫొటోల కోసం  తాపత్రయ పడుతున్నారే తప్ప ప్రజల ఇక్కట్లను పట్టించుకోవడంలేదని  మండిపడుతున్నారు. రద్దీ సమయంలో ఎన్‌ఎస్‌టీఎల్‌  అధికారులు లోపలి నుంచి వెళ్లేందుకు  అవకాశం ఇవ్వాలని వాహన చోదకులు కోరుతున్నారు.

అన్ని దారుల్లో రద్దీ
గోపాలపట్నం నుంచి ఎన్‌ఏడీ జంక్షన్‌కు వచ్చే దారులన్నీ రద్దీ గా తయారయ్యాయి.  గోపాలపట్నం నుంచి వచ్చే రోడ్డులో మాత్రం ట్రాఫిక్‌ భారీగా నిలిచి పోయింది. ఇటు ఏపీఏపీబీ కాలనీ 80అడుగుల రహదారిలో కూడా భారీగా వాహనాలు నిలిచి పోయాయి. ఎన్‌ఎస్టీఎల్‌ ఫ్యామిలీ గేటు(సింహాద్రి గేటు) వద్ద రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇక్కడి  సందులోనుంచి వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు గేటుకు అడ్డంగా ఉండడంతో ఎన్‌ఎస్‌టీఎల్‌ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. గేటు లోపలికి వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top