తండ్రి ఆరోగ్యశ్రీ.. తనయుడు కంటి వెలుగు

MLA Roja Speech In  Chittoor At YSR Kanti Velugu Program - Sakshi

సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వం ఉన్న నాయకుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్‌ కంటివెలుగు’ కార్యక్రమాన్ని ఆమె గురువారం చిత్తూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా  మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌ కంటివెలుగు’ కార్య‍క్రమం పేద ప్రజలకు మరో సంజీవని వంటిదని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారు.. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్‌ రెండు అడుగులు ముందుకువేసి ‘వైఎస్సార్‌ కంటివెలగు’ను ప్రారంభించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ కంటి సంబంధిత జబ్బులు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని.. ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని రోజా పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top