రంజాన్‌ సుఖ సంతోషాలు నింపాలి | MLA Pushpa Srivani Congratulations Ramzan | Sakshi
Sakshi News home page

రంజాన్‌ సుఖ సంతోషాలు నింపాలి

Jun 14 2018 4:35 AM | Updated on Jun 14 2018 4:35 AM

MLA Pushpa Srivani Congratulations Ramzan - Sakshi

ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి

కురుపాం : సుఖ సంతోషాలతో ముస్లిం సోదరులంతా బాగుండాలని, రంజాన్‌ ముస్లిం కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్‌ సీపీ అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అన్నారు. కురుపాంలోని శివ్వన్నపేటలో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్‌ సందర్భంగా ఇఫ్తార్‌ విందును ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో సహపంక్తిలో కూర్చొని ఫలాహారాన్ని స్వీకరించి రంజాన్‌ శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ ముస్లిం సోదరులంతా రంజాన్‌ పండగ సరదాగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ముస్లిం సోదరులు ఐక్యంగా కలసిమెలసి ఉంటూ ఆనందాల నడుమ రంజాన్‌ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింలు ఐక్యతను చాటడం ద్వారా మరింతగా ఎదగాలని పేర్కొన్నారు. ఇఫ్తార్‌ విందులో కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ నిషార్, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికారి ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు, గోరిశెట్టి గిరిబాబు, జి.వి.శ్రీనువాసరావు, జియ్యమ్మవలస మండల కన్వీనర్‌ గౌరీశంకరరావుతో పాటు  కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement