ఊళ్లో ఉండలేకపోతున్నాం సారూ.. | MLA gopireddy sought protection | Sakshi
Sakshi News home page

ఊళ్లో ఉండలేకపోతున్నాం సారూ..

Jan 6 2016 12:23 AM | Updated on Aug 10 2018 8:16 PM

అధికారపార్టీ నాయకుల అరాచకంతో ఊళ్లో ఉండలేకపోతున్నామని గురవాయపాలెంకు చెందిన పొడపాటి ...

డీఎస్పీని కలిసిన గురవాయపాలెం ప్రజలు
గ్రామంలో టీడీపీ నేతల అరాచకాలపై ఫిర్యాదు
రక్షణ కల్పించాలని కోరిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

 
నరసరావుపేట రూరల్ : అధికారపార్టీ నాయకుల అరాచకంతో ఊళ్లో ఉండలేకపోతున్నామని గురవాయపాలెంకు చెందిన పొడపాటి శివలీల, నాగరాజు డీఎస్పీ కె.నాగేశ్వరరావుకు తెలిపారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వారిని డీఎస్పీ వద్దకు తీసుకెళ్లారు. గత నెల 28వ తేదీన శివలీల కుమారుడు సుబ్బారావుపై గ్రామానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. ఆ తరువాత కూడా ఇంటి ముందు ఉన్న ట్రాక్టర్లపై రాళ్లు వేయడం, దుర్భాషలాడటంతోపాటు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి రాకపోకలు లేకుండా చేస్తూ బేదిరింపులకు పాల్పడుతున్నారని వారు డీఎస్పీకి వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామం వదిలివెళ్ళి పోవడమే తప్పా తమకు గత్యంతరం లేదని వారు తెలిపారు.

గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డీఎస్పీని కోరారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగటంతో కాకాని, యల్లమంద గ్రామాల్లో అనేక కుటుంబాలు గ్రామాలను వదిలి వెళ్లి పోయాయని వివరించారు. బాధితులకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి కోరారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేయాలని డీఎస్పీ రూరల్ సీఐ ప్రభాకర్‌ను ఆదేశించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామంలో ఉండవచ్చని ఇందుకు తగిన భద్రత తాము కల్పిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీకి చెందని వారిపై అకారణంగా దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారు గ్రామంలో తిరుగుతున్నా పోలీసులు ఇంత వరకు అరెస్ట్ చేయలేదన్నారు. నింధితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాకుమాను మంగపతిరెడ్డి, జొన్నలగడ్డరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement