'ఒక్క రోజు వచ్చి మెరిసి.. ఏదంటే అది చెప్పడం సరికాదు' | ministers narayana comments | Sakshi
Sakshi News home page

'ఒక్క రోజు వచ్చి మెరిసి.. ఏదంటే అది చెప్పడం సరికాదు'

Mar 6 2015 8:49 PM | Updated on Mar 22 2019 5:33 PM

'ఒక్క రోజు వచ్చి మెరిసి.. ఏదంటే అది చెప్పడం సరికాదు' - Sakshi

'ఒక్క రోజు వచ్చి మెరిసి.. ఏదంటే అది చెప్పడం సరికాదు'

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మంత్రి నారాయణ పరోక్ష విమర్శలకు దిగారు. ల్యాండ్ ఫూలింగ్ జరుగుతున్నప్పుడు నాయకులు తిరిగి ఉంటే బావుండేదని నారాయణ తాజాగా ఎద్దేవా చేశారు.

నెల్లూరు: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మంత్రి పి. నారాయణ పరోక్ష విమర్శలకు దిగారు. ల్యాండ్ ఫూలింగ్ జరుగుతున్నప్పుడు నాయకులు తిరిగి ఉంటే బావుండేదని నారాయణ తాజాగా ఎద్దేవా చేశారు. ఏదో ఒక్క రోజున వచ్చి తళుక్కున మెరిసి.. ఏదంటే అది చెప్పడం సరికాదన్నారు. భూసేకరణను వ్యతిరేకించే వారు ఒకటో, రెండో శాతమో ఉంటారని.. ఇక్కడకొచ్చి ఆటంకాలు చేస్తే రైతులు నష్టపోతారన్నారన్నారు.  ఇలాగే వ్యవహరిస్తే పారిశ్రామిక వేత్తలు కూడా కొత్త రాజధానికి రారని మంత్రి తెలిపారు.

 

ఏ రాజధాని కట్టాలన్నా ఎక్కడైనా 100 సంవత్సరాలు పడుతుందని,, 20, 30 ఏళ్లు కరెక్టు కాదన్నారు. చండీగఢ్ లో 60 ఏళ్లు దాటినా.. నిర్మాణం సాగుతోందన్నారు. గాంధీ నగర్, నయా రాయ్ పూర్ కూడా అంతేనని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణానికి రూ. లక్షన్నర కోట్లు కావాలి.. ఇది నిజమని నారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement