ఎన్నో సార్లు టమాటా సాగు చేసి తీవ్రంగా నష్టాలు చవిచూసిన రైతన్నలకు ప్రస్తుతం ఆ పంట సిరులు పండిస్తోంది. మండలంలో బోరు బావుల కింద సాగుచేసిన టమాటా దిగుబడి వచ్చే సమయానికి ధరలకు రెక్కలొచ్చాయి.
ఎన్‌పీకుంట, న్యూస్‌లైన్: ఎన్నో సార్లు టమాటా సాగు చేసి తీవ్రంగా నష్టాలు చవిచూసిన రైతన్నలకు ప్రస్తుతం ఆ పంట సిరులు పండిస్తోంది. మండలంలో బోరు బావుల కింద సాగుచేసిన టమాటా దిగుబడి వచ్చే సమయానికి ధరలకు రెక్కలొచ్చాయి.
పస్తుతం మదనపల్లి మార్కెట్‌లో 30 కిలోల టమాటా రూ.600 దాకా ధర పలుకుతోంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోవు రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశాలుండడంతో వారం లేదా పదిరోజుల్లో కోతకు వచ్చే తోటల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న ధరల ప్రకారమే దనియాన్‌చెరువు, రెడ్డివారిపల్లి, చీమలచెరువుపల్లి, నల్లగుట్టపల్లి, జౌకల తదితర గ్రామాల్లో టమాటా సాగు చేసిన రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా ప్రభుత్వం కూరగాయలు సాగు చేసే రైతులకు డ్రిప్‌తో పాటు పందిళ్లు వేసుకోవడానికి అవసరమయే సామగ్రి, విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు.