వర్గీకరణ విషయంలో 20ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.
నెల్లూరు: వర్గీకరణ విషయంలో 20ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కాపులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం అన్ని రకాల కులాలను బాబు వాడుకుంటున్నారన్నారు. బాబు ప్రమాణం చేసిన స్థలంలోనే ఏప్రిల్ 30న మాదిగల సభ ఉంటుందని స్పష్టం చేశారు.
దళితులంతా మళ్లీ దళితులుగానే పుట్టాలని కోరుకుంటారన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటూ దళితుల్లో పుడతానని మహాత్మా గాంధీనే అన్నారని మందకృష్ణ పేర్కొన్నారు. దళితులను అవమానించే విధంగా బాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేదంటే న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తాం. కేవలం కొన్ని వర్గాలకే ఓ పత్రిక కాపు కాస్తోందని ఆయన తెలిపారు. దళితుల పట్ల ఆ పత్రిక చిన్న చూపు చూస్తుందని చెప్పారు. చంద్రబాబు వద్ద ఉన్న దళిత భజనపరులు ఆత్మగౌరవం చంపుకుని మాట్లాడటం మంచిదికాదన్నారు.