అల్లర్లకు పాల్పడితే బైండోవర్‌ కేసులు

Kurnool SP Pakkirappa Sudden Visit To Nandikotkur PS - Sakshi

సాక్షి, కర్నూలు : అల్లర్లకు పాల్పడిన వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ పక్కిరప్ప అన్నారు. గురువారం నందికోట్కూరు పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో గ్రామాల్లో అల్లర్లు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించడంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top