ఆర్థికశాఖ అనుమతి లభించిన 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఆర్థికశాఖ అనుమతి లభించిన 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలు చూపి నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేయడం సబబు కాదన్నారు. నోటిఫికేషన్ల జారీ విషయమై కృష్ణయ్య మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కలి శారు. పోలీసు, టీచర్లు, లెక్చరర్ల నియామకాలు వెంటనే చేపట్టాలని విన్నవించారు.