భద్రాచలాన్ని తెలంగాణలో కొనసాగించాలంటూ టీజేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరహార దీక్షలు శనివారానికి 14వ రోజుకు చేరుకున్నాయి.
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలాన్ని తెలంగాణలో కొనసాగించాలంటూ టీజేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరహార దీక్షలు శనివారానికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలలో కాంట్రాక్ట్, రిసోర్సెస్ ఉద్యోగులు, వడ్డెర సంఘం నాయకులు కూర్చున్నారు. బీజేపీ నాయకులు బెహరా, పసుమర్తి సతీష్ ఆమరణ నిరహార దీక్ష 4వ రోజుకు చేరుకోగా, పలువురు సందర్శించి మద్దతును తెలిపారు. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో పోలీసులు దీక్షలను విరమింపజేసి ఆస్పత్రికి తరలించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి గౌసుద్దీన్, టీజేఏసీ నేత వెక్కిరాల శ్రీనివాస్, ఈశ్వర్, సోమశేఖర్, జీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు సోందె వీరయ్య, కల్పన, సుబ్బారావు, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.