విశాఖ విమానాశ్రయంలో నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి ఉగ్రవాదులు చొరబడడం, భద్రతా బలగాలు కూంబింగ్‌కు దిగడంతో నేవీ ఆధీనంలో ఉన్న విశాఖ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి ఉగ్రవాదులు చొరబడడం, భద్రతా బలగాలు కూంబింగ్‌కు దిగడంతో నేవీ ఆధీనంలో ఉన్న విశాఖ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి వరకూ పికెట్లు ఏర్పాటు చేశారు. వీరితో పాటు పోలీసు బలగాలూ నిఘా కాశాయి.
విమానాశ్రయానికి వచ్చి వెళ్లే ప్రయాణికులు, సందర్శకులను తనిఖీలు చేస్తున్నారు. వాహనాలను బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు జరుపుతున్నారు. భద్రతా కారణాల నేపధ్యంలో సందర్శకుల ప్రవేశాలు టెర్మినల్ భవనంలోకి నిషేధించారు. నిషేధాజ్ఞలు శుక్రవారం వరకూ ఉండొచ్చని అధికారులు భావించినా పఠాన్‌కోట్‌లో తీవ్రవాదుల కలకలం, భద్రతా బలగాల కూబింగ్ చర్యలు కొనసాగుతుండడంతో నిషేధాజ్ఞలు మరి కొద్ది రోజులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.