రాబోయే 48 గంటల్లో తెలంగాణ ప్రాంతంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాబోయే 48 గంటల్లో తెలంగాణ ప్రాంతంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తమిళనాడు పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని, దానివల్ల రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
అలాగే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తెలంగాణ ప్రాంతంలో మామిడికాయలు రాలిపోవడం, పంటలు నేలరాలిపోవడంతో రైతులు అపారంగా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురిస్తే మరింత నష్టపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.