వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆరు గంటలకు హెల్త్ బులెటిన్! | Health Bulletin on YS Jagan Mohan Reddy at 6pm for day three | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆరు గంటలకు హెల్త్ బులెటిన్!

Aug 27 2013 5:55 PM | Updated on Aug 8 2018 5:51 PM

వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆరు గంటలకు హెల్త్ బులెటిన్! - Sakshi

వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆరు గంటలకు హెల్త్ బులెటిన్!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై చంచల్‌గూడ జైలు అధికారులు హెల్త్ బులెటిన్ ను ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై చంచల్‌గూడ జైలు అధికారులు హెల్త్ బులెటిన్ ను ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. సోమవారం సాయంత్రం వైఎస్ జగన్ కు మరోసారి వైద్య పరీక్షలు జరుపనున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిరంకుశ నిర్ణయానికి నిరసనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. 
 
 
వైఎస్ జగన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్‌తో వైఎస్ఆర్ సీపీ నేతలు సోమవారం కోరారు. వైఎస్ఆర్ సీపీ నేతలు శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావుల విజ్ఞప్తికి జైళ్ల శాఖ ఐజీ సానుకూలంగా స్పందించి.. ప్రతిరోజు ఆరు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు. సోమవారం సాయంత్రం ఆరుగంటలకు జగన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement