జిల్లాలోని వివిధ మండలాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కన్వీనర్లను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లగొండ టు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని వివిధ మండలాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కన్వీనర్లను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కోడి మల్లయ్య, పెద్దపోలు సైదులుగౌడ్, గాదె లూర్ధుమారెడ్డి, పోతుళ్ల జానయ్యలను నియమించారు.
అనుబంధ కన్వీనర్ల నియామకం
వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ల నియామకం జరిగింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి. ఎస్సీ విభాగం కన్వీనర్‌గా ఇరుగు సునీల్‌కుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్, విద్యార్థి విభాగం క న్వీనర్‌గా పాచిపాల వేణుయాదవ్‌ను నియమించినట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తాప్రతాప్‌రెడ్డి గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.