కల్యాణి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు | Flood intensity huge water in Kalyani Project | Sakshi
Sakshi News home page

కల్యాణి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు

Oct 26 2013 3:32 AM | Updated on Aug 1 2018 3:59 PM

మండలంలోని కల్యాణి ప్రాజెక్టులో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

 ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : మండలంలోని కల్యాణి ప్రాజెక్టులో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మండలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టు ఎగువ భాగంలో గత రాత్రి నుంచి కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులో ఉదయం 100 క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 408.5 మీటర్లుగా కావడంతో ప్రధాన కాలువ ద్వారా వస్తున్న ఇన్‌ఫ్లో నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి ఎక్కువైతే ప్రధాన గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతామన్నారు.
 
 కాకతీయ కాలువకు తగ్గిన నీటి విడుదల
 బాల్కొండ, : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదలను శుక్రవారం 6500 క్యూసెక్కుల నుంచి మూడు వేల క్యూసెక్కులకు  అధికారులు తగ్గించారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో, ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా జరుగుతున్న నీటి విడుదల సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులతో ఉందని అధికారులు తెలిపారు.
 
 జలాశయాల్లోకి పెరిగిన వరదనీరు
 నిజాంసాగర్ : తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన జలాశయాల్లోకి వరదనీరు పెరుగుతోంది. ఎ గువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వస్తున్న వరద నీటితో ప్రాజె క్టుల నీటిమట్టాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.  నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం 910 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1404.01 అడుగులతో 16.357 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే మెదక్‌జిల్లాలోని సింగూరు జలాశయంలోకి 6,195 క్యూసెక్కుల మేర వర ద నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 522. 800 మీటర్లతో 25.570 టీఎంసీల నీరు నిల్వ ఉందని స్థానిక నీటిపారు దల శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఉదయం వరకు 3.5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వారు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement