breaking news
Kalyani Project
-
అకాల వర్షాలతో అనుకోని జలకళ
జలాశయాలలోకి భారీ వరద పొంగి పొర్లుతున్న నల్లవాగు నిండిన కళ్యాణి ప్రాజెక్టు పంటలకు మాత్రం తీరని నష్టం నిజాంసాగర్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు కురుస్తుండడంతో అనుకోని రీతిలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొం గి ప్రవహిస్తున్నాయి. వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయాలలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. అయి తే వర్షాల కారణంగా పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పండిస్తున్న పంటలు నాశనమవుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్‌లో జిల్లాలో సుమారు 2.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నిజాం సాగర్ ప్రాజెక్టునుంచి సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాలనుంచి 811 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,398.92 అడుగుల(10.228 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. చిన్న ప్రాజెక్టులు మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల ప్రభావంతో మండలంలోని నల్లవాగు మత్తడి పొంగి పొర్లుతోంది. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని సింగితం రిజర్వాయర్‌లోకి ప్రస్తుతం 150 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టులోకీ వరదనీరు వచ్చి చేరుతోంది. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409 మీటర్లు కాగా ఆదివారం సాయంత్రానికి 408.800 మీటర్ల నీరుంది. రైతన్నపై తీవ్ర ప్రభావం అకాల వర్షాలు రబీ పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. వ్యవసాయ బోరుబావులు, చెరువులు, కుంటలతోపాటు ప్రధాన జలాశయాల కింద సాగవుతున్న పంటలకు అపార నష్టం కలిగించాయి. జిల్లాలో పొద్దుతిరుగుడు, మొక్క జొన్న, జొన్న పంటలకు పూర్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వరి ఇతర పంటలు సైతం దెబ్బతిన్నాయి. 117 మిల్లీమీటర్లు జిల్లాలో పది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈనెలలో 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో సైతం వారం వ్యవధిలో ఇంతగా వర్షపాతం నమోదు కాదని రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల ఒకటిన 12 మిల్లిమీటర్లు, 4న 35 మి.మి., 5 న 16 మి.మి., 6న 34 మి.మి., 8న 20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
కల్యాణి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : మండలంలోని కల్యాణి ప్రాజెక్టులో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మండలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టు ఎగువ భాగంలో గత రాత్రి నుంచి కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులో ఉదయం 100 క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 408.5 మీటర్లుగా కావడంతో ప్రధాన కాలువ ద్వారా వస్తున్న ఇన్‌ఫ్లో నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి ఎక్కువైతే ప్రధాన గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతామన్నారు. కాకతీయ కాలువకు తగ్గిన నీటి విడుదల బాల్కొండ, : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదలను శుక్రవారం 6500 క్యూసెక్కుల నుంచి మూడు వేల క్యూసెక్కులకు అధికారులు తగ్గించారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో, ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా జరుగుతున్న నీటి విడుదల సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులతో ఉందని అధికారులు తెలిపారు. జలాశయాల్లోకి పెరిగిన వరదనీరు నిజాంసాగర్ : తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన జలాశయాల్లోకి వరదనీరు పెరుగుతోంది. ఎ గువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వస్తున్న వరద నీటితో ప్రాజె క్టుల నీటిమట్టాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం 910 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1404.01 అడుగులతో 16.357 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే మెదక్జిల్లాలోని సింగూరు జలాశయంలోకి 6,195 క్యూసెక్కుల మేర వర ద నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 522. 800 మీటర్లతో 25.570 టీఎంసీల నీరు నిల్వ ఉందని స్థానిక నీటిపారు దల శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఉదయం వరకు 3.5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వారు చెప్పారు.