పద్మజ థియేటర్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident At Padmaja Theatre Malikipuram | Sakshi
Sakshi News home page

పద్మజ థియేటర్‌లో అగ్ని ప్రమాదం

Apr 22 2019 6:50 PM | Updated on Apr 22 2019 8:41 PM

Fire Accident At Padmaja Theatre Malikipuram - Sakshi

మధ్యాహ్నం షో ప్రారంభం అవుతున్న సమయంలో..

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని ఓ సినిమా థియేటర్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మలికిపురంలోని పద్మజ థియేటర్‌లో మధ్యాహ్నం షో ప్రారంభం అవుతున్న సమయంలో షార్ట్‌ సర్క్యట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే థియేటర్‌లోని ప్రేక్షకులను ముందుగానే బయటకు పంపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు భయాందోళకు గురయ్యారు. థియేటర్‌లోని ఫర్నీచర్‌ అగ్నికి అహుతి అవ్వగా.. పై కప్పు పూర్తిగా కాలిపోయింది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement